తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆన్​లైన్​లో పూర్తిస్థాయి అసోం 'ఎన్​ఆర్​సీ' - అసోం

అసోం జాతీయ పౌర రిజిస్టర్​ తుది జాబితాను విడుదల చేసిన దాదాపు పక్షం రోజుల అనంతరం పూర్తిస్థాయి జాబితాను ఆన్​లైన్​లో అందుబాటులోకి తెచ్చారు అధికారులు. త్వరలోనే మినహాయింపుదారులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. విదేశీ ట్రైబునళ్ల వద్ద 120 రోజుల్లోపు అప్పీల్​ చేసుకోవాలని సూచించారు.

ఆన్​లైన్​లో పూర్తిస్థాయి అసోం 'ఎన్​ఆర్​సీ'

By

Published : Sep 14, 2019, 8:27 PM IST

Updated : Sep 30, 2019, 3:10 PM IST

అసోం జాతీయ పౌర రిజిస్టర్​ (ఎన్​ఆర్​సీ)ను పూర్తిస్థాయిలో మొత్తం 3.30 కోట్ల మంది దరఖాస్తుదారుల పేర్లతో ఆన్​లైన్​లో అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. ఆంగ్లం, అసోం భాషల్లో జాబితాలు రూపొందించారు.

ఆగస్టు 31న విడుదల చేసిన తుది జాబితాలో మొత్తం 3కోట్ల 11లక్షల 21వేల నాలుగు మందికి చోటు లభించింది. సరైన పత్రాలు సమర్పించని కారణంగా 19 లక్షల 6వేల 657 మందిని జాబితాలో చేర్చలేదు. వీరందరి వివరాలను ఆన్​లైన్​లో ఉంచారు.

విదేశీ ట్రైబునళ్ల వద్ద ఫిర్యాదు చేసేందుకు మినహాయింపు ధ్రువపత్రాలు ఇంకా జారీ చేయలేదని ఎన్​ఆర్​సీ రాష్ట్ర కోఆర్డినేటర్​ తెలిపారు. త్వరలోనే అందుబాటులోకి తెస్తామని.. వివిధ ఎన్​ఆర్​సీ సేవా కేంద్రాల నుంచి ఈ ధ్రువపత్రాలు తీసుకోవాలని సూచించారు. వాటి ద్వారా సంబంధిత విదేశీ ట్రైబున్యళ్ల వద్ద 120 రోజుల్లో అప్పీల్​ చేసుకోవాలని చెప్పారు.

సుప్రీం కోర్టుకు హోంశాఖ!

ఎన్​ఆర్​సీ అధికారులు జిల్లాల వారీగా మినహాయింపు జాబితాను అందుబాటులో ఉంచడంలో విఫలమయ్యారు. విదేశీ ట్రైబునళ్ల ఏర్పాటుకు అవసరమైన జిల్లాల వారి జాబితా లేకపోవటంపై కేంద్ర హోంశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయపై సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

జాబితాలో చోటు దక్కని వారి కేసులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 100 విదేశీ ట్రైబునళ్లకు అదనంగా మరో 200 కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఎన్​ఆర్​సీ జాబితాను విడుదల చేసిన నుంచి చోటు దక్కని ప్రజలు పూర్తి సందిగ్ధంలో పడిపోయారు. ఎక్కడకు వెళ్లాలి, ఏవిధంగా ఫిర్యాదు చేయాలి అనే అంశంలో గందరగోళం ఏర్పడింది. ఈ మేరకు కేంద్రం వారికి భరోసా కల్పించింది. జాబితాలో పేరు లేనంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలు కల్పిపిస్తామని హామీ ఇచ్చింది.

ఇదీ చూడండి: చంద్రయాన్​ కోసం కృష్ణుడికి 56 వంటకాలతో నైవేద్యం

Last Updated : Sep 30, 2019, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details