భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న శ్రీహరన్ పెరోల్‌పై జైలు నుంచి విడుదలైంది. తన కుమార్తె పెళ్లి ఏర్పాట్ల కోసం ఆరు నెలల పాటు పెరోల్ ఇవ్వాలని కోరుతూ నళిని ఇటీవల మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఆమె అభ్యర్థనపై విచారణ జరిపిన న్యాయస్థానం...నళిని తల్లి, మరో మహిళ పూచికత్తుపై నెలరోజులు పెరోల్ ఇవ్వడానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పెరోల్ సమయంలో ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, రాజకీయ నాయకులను కలవొద్దని న్యాయస్థానం షరతులు విధించింది.
రాజీవ్ హత్యకేసులో దోషి నళిని విడుదల - Rajiv
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ నేడు పెరోల్‌పై జైలు నుంచి విడుదలైంది.
![రాజీవ్ హత్యకేసులో దోషి నళిని విడుదల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3940380-1064-3940380-1564036642868.jpg)
రాజీవ్ హత్యకేసు నిందితురాలు నళిని విడుదల
తమిళనాడు వెల్లూరులోని మహిళా కారాగారంలో 1991 నుంచి శిక్ష అనుభవిస్తోంది నళిని. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఈమెతో పాటు మరో ఆరుగురిని దోషులుగా తేల్చింది న్యాయస్థానం. నళిని భర్త మురుగన్కూ యవజ్జీవ జైలుశిక్ష విధించింది.
రాజీవ్ హత్యకేసులో దోషి నళిని విడుదల
Last Updated : Jul 25, 2019, 2:58 PM IST