భారత సంప్రదాయాన్ని సంరక్షించడానికి అందరం కలిసి పని చేయాలని ప్రజలకు సూచించారు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. పంచుకోవడం, పరిరక్షించడం వంటి తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. మైసూరు 25వ పాలకుడు జయ చామరాజా వడియార్ జయంతి వేడుకలను పురస్కరించుకొని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు ఉపరాష్ట్రపతి.
చరిత్రను సృష్టించిన గొప్ప పాలకుడి రాజనీతి, జ్ఞానం, దేశభక్తిని దృష్టిలో ఉంచుకొని వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు నాయుడు.