తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముట్టుకోకుండానే మోగుతున్న గుడి గంట - Nikhil Mankar

కరోనా నేపథ్యంలో ఏది ముట్టుకున్నా చేతులను శానిటైజర్​తో కడిగేసుకోవడం అలవాటైపోయింది. మరి గుడికి వెళ్తే గంటను కచ్చితంగా ముట్టుకోవాల్సిందే కదా! వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో టచ్​ చేయకుండానే మోగేలా నయా గంటను ఆవిష్కరించారు నాగ్​పుర్​కు చెందిన ప్రొఫెసర్​ నిఖిల్​​.

Nagpur professor invents touch-free temple bell
ఆలయంలో గంట కొట్టకుండానే మోగుతుంది!

By

Published : Sep 24, 2020, 8:06 AM IST

మహారాష్ట్ర నాగ్​పుర్​కు చెందిన నిఖిల్​ మంకర్​ అనే ప్రొఫెసర్​... ముట్టుకోకుండా గుడిలో గంటను కొట్టేలా సరికొత్త ఆవిష్కరణ చేశారు. దీని వల్ల వైరస్​ సోకే ప్రమాదం తగ్గుతుందని తెలిపారు.

ఈ గంటను సెన్సార్​ టెక్నాలజీతో రూపొందించారు నిఖిల్​. సెన్సార్ కింద చేయి పెడితే గంట మోగే విధంగా రూపొందించినట్లు తెలిపారు. ​దీన్ని తయారు చేయడానికి రూ.250 ఖర్చు అయినట్లు చెప్పారు.

అన్​లాక్​ ప్రక్రియలో భాగంగా సడలింపుల వల్ల దేశవ్యాప్తంగా దేవాలయాలు తెరుచుకునే అవకాశముంది. మరోవైపు దేశంలో కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు కరోనా సోకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు నిఖిల్​.

ముట్టుకోకుండానే మోగుతున్న గుడి గంట..

నాగ్​పుర్​ జిల్లాలో శవనెర్​లోని ఆదర్శ విద్యాలయంలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు ​నిఖిల్ మంకర్. గతంలోనూ 150 రూపాయల ఖర్చుతో..​ హ్యాండ్​ శానిటైజర్​ మిషన్​ను తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి:టాపర్లకు కార్లు బహుమతిగా ఇచ్చిన మంత్రి

ABOUT THE AUTHOR

...view details