తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడికి జెడ్​ కేటగిరి భద్రత - నడ్డా

భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు జెడ్​ కేటగిరి భద్రతను కల్పించనున్నట్లు హోంశాఖ ప్రకటించింది.  భద్రతా కారణాల దృష్ట్యా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

భద్రతా దృష్ట్యా నడ్డాకి జెడ్​ కేటగిరి

By

Published : Oct 10, 2019, 8:09 PM IST

భాజపా కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. సీఆర్​పీఎఫ్​​ బలగాలకు చెందిన కమాండోస్​తో జెడ్​ కేటగిరి కల్పిసున్నట్లు తెలిపింది. నడ్డాకు ప్రాణహాని ఉందన్న కారణంతో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకునన్నట్లు వెల్లడించింది.

ఇకపై 35 మంది సీఆర్​పీఎఫ్​ కమాండోస్ నడ్డాకు 24గంటల పాటు రక్షణ కల్పిస్తారు. దేశంలో ఆయన ఎక్కడికి ప్రయాణించిన దాదాపు 8 నుంచి 9 మందితో కూడిన బృందం నిత్యం ఆయన వెంట ఉంటారు.

ఇదీ చూడండి : 'దేశంలో గణనీయంగా తగ్గిన అంధత్వ సమస్య'

ABOUT THE AUTHOR

...view details