భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. ఆదివారం పుదుచ్చేరి పర్యటనలో బిజీబిజీగా గడిపారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే 23కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్రియాశీల కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. "పుదుచ్చేరి మారుతుంది-కమలం వికసిస్తుంది" అనే నినాదాన్ని ఇచ్చారు.
"కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే శాసనసభలో 23 సీట్ల కన్నా ఎక్కువగా గెలుస్తామనే నమ్మకం కలుగుతోంది. పుదుచ్చేరికి మంచి రోజులు రాబోతున్నాయి. భాజపా చేసే అభివృద్ధితో పుదుచ్చేరిని అవినీతి రహితంగా మారుద్దాం."
-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు.