కేంద్ర ప్రభుత్వం.. చైనాకు భారత భూభాగాన్ని అప్పగించిందని రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. 2008లో కాంగ్రెస్, చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని మండిపడ్డారు. ఆ తర్వాతే భారత భూభాగాన్ని చైనాకు కాంగ్రెస్ అప్పగించిందని ట్విట్టర్‌లో ఆరోపించారు నడ్డా. అప్పట్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హోదాలో రాహుల్ గాంధీ, ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడి హోదాలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని నడ్డా అన్నారు.
కష్ట సమయంలో రాహుల్ దేశాన్ని విభజించి, సైనిక దళాల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా ప్రయత్నిస్తుంటారని ఎదురుదాడికి దిగారు. డోక్లాం ఘటన జరిగిన సమయంలో కూడా రాహుల్ చైనా దౌత్య కార్యాలయానికి రహస్యంగా వెళ్లినట్లు ఆరోపించారు నడ్డా.