దేశ రాజధాని దిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని చెప్పారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. బలమైన, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామని తెలిపారు.
దిల్లీ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణం చేయబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు చెప్పారు నడ్డా. దిల్లీలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఆప్ కృషి చేస్తుందని ఆశిస్తున్నట్లు వరుస ట్వీట్లు చేశారు.