ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నప్పుడు సంయమనం పాటించినందుకు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌పై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. నిరసన వ్యక్తం చేసిన సభ్యుల ప్రవర్తనను తప్పుబట్టారు. 'కుదిరితే తమ దారి.. లేదంటే రహదారి' వైఖరి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
"ఆందోళనలు జరిగిన సమయంలో డిప్యూటీ ఛైర్మన్ తెలివిగా వ్యవహరించారు. తీర్మానంపై ఓటింగ్ కోసం కనీసం 13 సార్లు ప్రకటన చేశారు. నిరసన చేపట్టిన సభ్యులను తమ సీట్లలో కూర్చోవాలని పదేపదే కోరారు. కానీ ఎవరూ తమ సీట్లలో కూర్చోలేదు. ఆ పరిస్థితిలో డిప్యూటీ ఛైర్మన్ సంయమనం పాటించారు."
-వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్
రాజ్యసభ సమావేశాలను బహిష్కరించాలన్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు పునఃపరిశీలించుకోవాలని సూచించారు వెంకయ్య. తిరిగి సభకు హాజరయి చర్చల్లో పాల్గొనాలని కోరారు.
ఇదీ చదవండి-రాజ్యసభ లోపలే విపక్షాల ధర్నా- మండిపడ్డ నడ్డా
"ప్రజాస్వామ్యం అంటే చర్చలు, వాదనలు, నిర్ణయాలు. అంతేగానీ అంతరాయాలు కాదు. మనది పెద్దల సభ. టీవీల్లో కనిపిస్తున్న దృశ్యాలు ఈ సభ ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా.. ప్రతి భారతీయుడికి విచారం కలిగిచేవిగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సభ్యుల పూర్తి భాగస్వామ్యంతో సభను నడపాలని భావిస్తున్నా. చర్చించండి, వాకౌట్ చేయండి, ఓటు వేయండి లేదంటే ప్రజాస్వామ్యం అంతా ఆగిపోతుంది."
-వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్
అది సరికాదు
ఛైర్మన్‌పై నిందలు మోపి.. వివాదంలోకి లాగడానికి సభ్యులు ప్రయత్నించకూడదని హితవు పలికారు వెంకయ్య. సభ్యులను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి కాదని గుర్తుచేశారు. కొంతమంది సభ్యుల వికృత ప్రవర్తన వల్లే ప్రభుత్వం ప్రతిపాదించిన సస్పెన్షన్‌ను తాను అనుమతించినట్లు వెంకయ్య వివరించారు. సభ్యుల సస్పెన్షన్‌పై తానేం సంతోషంగా లేనని... సస్పెన్షన్‌కు గురైన సభ్యులు తాము చేసిన పనిని ఇంటర్వ్యూలలో సమర్థించుకున్నారని అన్నారు. వెల్‌లోకి దూసుకెళ్లడం, పేపర్లు చించేయడం చేసినట్లు ఒప్పుకున్నారని చెప్పారు.
ఇదీ చదవండి-రాజ్యసభలో 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
"కొంతమంది సభ్యులు కుదిరితే నా దారి లేదంటే రహదారి అనే వైఖరితో ఉన్నారు. అది సరైనది కాదు. దాన్ని ఆమోదించేది లేదు. మీకు సంఖ్యాబలం ఉంది. మీ సీట్లలో ఉండి ఓటింగ్ కోసం అభ్యర్థించాలి. మేం తీసుకున్న చర్యలు సభ్యుల ప్రవర్తనపైనే, సభ్యులపై కాదు. ఏ సభ్యుడికీ మేం వ్యతిరేకం కాదు. ఉభయసభలలో సభ్యులను గతంలో ఎలా సస్పెండ్ చేశారనేదానిపై నా వద్ద సుదీర్ఘ జాబితా ఉంది. కానీ ప్రస్తుతం జరిగిన దానిని సమర్థించుకోవడానికి ఆ ఉదహరణలను ఉపయోగించడం లేదు."
-వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్
డిప్యూటీ ఛైర్మన్‌పై తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంపై స్పష్టతనిచ్చారు వెంకయ్య. విపక్షాలు ప్రవేశపెట్టిన రిజల్యూషన్ ఓ తీర్మానం రూపంలో ఉండాల్సిందని అన్నారు. 14 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వలేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి-ఎంపీల వేటుపై అట్టుడికిన పెద్దల సభ
గందరగోళం నడుమ బిల్లులను ఆమోదింపజేశారన్న విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు వెంకయ్య. అల్లర్ల మధ్యే గతంలో రెండు సభలలో కలిపి 15 బిల్లులు ఆమోదం పొందాయని గుర్తు చేశారు. చాలా ముఖ్యమైన బిల్లులనూ ఇదే విధంగా ఆమోదింపజేశారని అన్నారు.
ఇదీ చదవండి-