తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా పేరు  రాహుల్ గాంధీ.. సావర్కర్​ కాదు'

కాంగ్రెస్​ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్​ బచావో ర్యాలీ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. నిజాలు మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేశారు. నా పేరు రాహుల్​ గాంధీ.. సావర్కర్​ కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Rahul Gandhi
'నా పేరు  రాహుల్ గాంధీ.. సావర్కర్​ కాదు'

By

Published : Dec 14, 2019, 1:52 PM IST

నిజాలు మాట్లాడినందుకు తాను ఎప్పటికీ క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. క్షమాపణలు చెప్పాల్సి వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన సన్నిహితుడు అమిత్​ షాలు చెప్పాలన్నారు.

'భారత్ బచావో' పేరిట​ దిల్లీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్​ నిర్వహించిన బహిరంగ సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్​. రేప్​ ఇన్​ ఇండియా వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

'నా పేరు రాహుల్ గాంధీ.. సావర్కర్​ కాదు'

" నా పేరు రాహుల్​ గాంధీ, రాహుల్​ సావర్కర్​ కాదు. నిజాలు మాట్లాడినందుకు నేను ఎప్పుడూ క్షమాపణలు చెప్పను. ఏ ఒక్క కాంగ్రెస్​ కార్యకర్త కూడా అలా చేయడు. మోదీ వల్ల దేశం తీవ్రంగా నష్టపోయింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. నల్లధనం నిర్మూలన పేరిట అందరి జేబుల్లోని డబ్బును వెనక్కి తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఆయన అనుకూల పెద్దలకే ప్రయోజనం చేకూర్చారు. ప్రజలకు కొనుగోలు శక్తి లేకుండా చేశారు."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత.

భారత్​ బచావో కార్యక్రమంలో కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, ప్రియాంక గాంధీ సహా పార్టీ అగ్రనేతలు, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details