తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కోర్టుల్లో జాప్యానికి నేనూ బాధితురాలినే' - Court Delay news

ఈనెల 19న పదవీ విరమణ చేయనున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఆర్ భానుమతి. వీడియో ద్వారా జరిగిన వీడ్కోలు సమావేశంలో పలు విషయాలు పంచుకున్నారు. కోర్టుల్లో జాప్యానికి తాను కూడా బాధితురాలినేనని గుర్తు చేసుకున్నారు.

My Family Also Victim of Court Delay, Says Justice R Banumathi in Her Farewell Address
'కోర్టుల్లో జాప్యానికి నేనూ బాధితురాలినే'

By

Published : Jul 18, 2020, 8:17 AM IST

కోర్టుల్లో జాప్యానికి తానూ బాధితురాలినేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్​.భానుమతి అన్నారు. ఈనెల 19న పదవీ విరమణ చేయనున్న ఆమె.. శుక్రవారం చివరిసారిగా కోర్టును నిర్వహించారు. అనంతరం బార్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో వీడియో ద్వారా జరిగిన వీడ్కోలు సమావేశంలో ప్రసంగిస్తూ చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు.

'నేను రెండేళ్ల వయసులో ఉన్నపుడు మా నాన్న బస్సు ప్రమాదంలో మరణించారు. అప్పట్లో నష్ట పరిహారం పొందాలంటే కోర్టులో కేసు వేయాల్సి ఉండేది. కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది. సంక్లిష్టమైన ప్రక్రియతో పాటు ఎవరి సాయం లేకపోవడంతో పరిహారం పొందలేకపోయాం' అని జస్టిస్ భానుమతి చెప్పారు. మూడు దశాబ్దాలుగా వివిధ కోర్టుల్లో పనిచేశానని, ఎలాంటి కారణాలు లేకపోయినా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని తెలిపారు.

నిర్భయ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిగా జస్టిస్​ భానుమతి గుర్తుండిపోతారని అటార్నీ జనరల్​ కే కే వేణుగోపాల్​ అన్నారు.

ఇదీ చూడండి: ప్రియురాలిని కలిసేందుకు పాక్​కు పయనం.. కానీ!

ABOUT THE AUTHOR

...view details