బిహార్లో కల్లోలం సృష్టించిన మెదడు వాపు వ్యాధి విజృంభణపై ముజఫర్పుర్ జిల్లా కోర్టు ఆరా తీసింది. వ్యాధితో వందల మంది చిన్నారుల మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, బిహార్ మంత్రి మంగళ్ పాండే నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా చీఫ్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారి.
కేంద్ర, రాష్ట్ర మంత్రులపై విచారణకు కోర్టు ఆదేశం - హర్షవర్ధన్
బిహార్లో మెదడువాపు వ్యాధి మరణాలపై ముజఫర్పుర్ జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రుల నిర్లక్ష్యంపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
హర్షవర్ధన్
Last Updated : Jun 24, 2019, 2:20 PM IST