తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు - women to pay alimony in PU

ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ ఫ్యామిలీకోర్టు అరుదైన తీర్పు ఇచ్చింది. విడాకులు తీసుకోకుండా 10ఏళ్లుగా విడిగా ఉంటున్న ఓ ప్రభుత్వ అధికారిణిని.. ఖర్చుల నిమిత్తం తన భర్తకు భరణం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

muzaffarnagar-family-court-order-a-woman-to-pay-allowance-her-husband
భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు

By

Published : Oct 26, 2020, 2:13 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్ కతౌలీ తెహ్సిల్ జిల్లా ఫ్యామిలీ కోర్టు.. భర్తకు నెలవారీ భరణం ఇవ్వాల్సిందిగా ఓ ప్రభుత్వ ఉద్యోగినినిఆదేశించింది. దాదాపు 9 సంవత్సరాల విచారణ తరువాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అయితే నెలకు 2వేలు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ఇవ్వడం గమనార్హం.

కిషోరీలాల్​ సోహుంకర్, మున్నాదేవీలకు 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దంపతులు 10ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నారు. మున్నాదేవీ కాన్పూర్​లోని భారత ఆర్మీలో నాలుగో గ్రేడ్ ఉద్యోగినిగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. ఆమెకు నెలకు 12వేల పింఛను వస్తోంది. కిషోరీలాల్ కతౌలీలో ఓ టీషాపు నడుపుతున్నాడు. అతని పేదరికం కారణంగా తన భార్యకు వచ్చే పింఛనులో కొంత ఇవ్వాలంటూ 9 ఏళ్ల క్రితం ముజఫర్​నగర్​లోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు. ఈ క్రమంలో కోర్టు తీర్పును వెలువరించింది.

"కోర్టు తీర్పుతో నాకు తృప్తి కలగలేదు. దాదాపు 9ఏళ్ల తరువాత కోర్టు తీర్పును వెలువరించింది. నేను రుణం ​ తీసుకొని ఈకేసు కోసం పోరాడాను. 20ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. నాకు కేవలం రూ.2వేలు ఇవ్వాలని కోర్టు తెలిపింది. కానీ ప్రస్తుతం నా భార్య పింఛను రూ.12వేల కంటే ఎక్కువే వస్తోంది."

---కిషోరీలాల్​ సోహుంకర్.

కేసు ఇంకా పరిష్కారం కాలేదని కిషోరీలాల్​ అడ్వకేట్​ బలేష్​ కుమార్​ తయాల్ తెలిపారు. ఇద్దరు కలిసుండాలని కోర్టు గతంలో ఆదేశించింది. కానీ మున్నీదేవి దానికి అంగీకరించలేదన్నారు. దంపతులు ఇంకా విడాకులు తీసుకోలేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details