అత్యంత ఎత్తులో, పచ్చతివాచీతో పర్యటకులకు స్వాగతం పలుకుతుంది ఈ ప్రదేశం. ట్రెక్కింగ్ ముందుకు సాగే కొద్దీ... అంతెత్తున ఉండే పచ్చికతో మార్గం ఇరుకుగా మారుతుంది. స్థానికంగా ఆ గడ్డిని "కొత్తపుల్లు" అంటారు. మేఘాలను తాకే ఆ పర్వత శిఖరాన్ని చేరుకున్న చుట్టూచూస్తే ప్రకృతి సౌందర్యం అనిర్వచనీయ అనుభూతి కలిగిస్తుంది. కేరళలోని కొట్టాయం జిల్లా కున్నొన్ని సమయంలో ఉన్నాయి ముత్తుకోరమల పర్వతాలు.
కొండపైకి నడక ఆషామాషీ కాదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. రాళ్ల బాటలో జారిపడే ప్రమాదం ఉంటుంది. అందుకే అక్కడ ట్రెక్కింగ్‌కు ఒంటరిగా కాక తోడు తీసుకునివెళ్లడం ఉత్తమం.
ఇటీవల చాలామంది యువత ముత్తుకోరమలశ్రేణుల్లో ట్రెక్కింగ్ కోసం వస్తున్నారు. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు, వర్షం ఉన్నప్పుడు ట్రెక్కింగ్ చేయవద్దనే వారికి విజ్ఞప్తి. అది చాలా ప్రమాదకరం. ఏదేమైనా, కేరళ పర్యటక పటంలో చోటు దక్కించుకున్న ఈ ప్రాంత అందాలు ఆస్వాదించాలంటే ఔత్సాహికులు ఒకసారి ఇక్కడికి రావాల్సిందే.
-జాయ్ జార్జ్, సామాజిక కార్యకర్త
వంగమాన్ పర్వతశ్రేణులకు దాదాపు సమానమైన ఎత్తులో నిలిచి ఉంటాయి ముత్తుకోరమల పర్వతాలు. కొట్టాయం జిల్లాలోని మరో పర్యాటక కేంద్రమైన ఇల్లికల్ మాలా కొండలకు కూడా సమానస్థాయిలో ఉంటాయి ముత్తుకోరమల్ పర్వతాలు. క్రమంగా అక్కడ పర్యాటక సందడి పెరుగుతుండడంతో స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.