'మహిళలకు మసీదుల్లో ప్రవేశం ఉంది' - latest national news
మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం ఉందని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. ఇటీవలే ఇద్దరు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ఆదేశాల మేరకు పర్సనల్ లాబోర్డు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది.
'మహిళలకు మసీదుల్లో ప్రవేశం ఉంది'
మసీదుల్లోకి మహిళల ప్రవేశం కోరుతూ సుప్రీంకోర్టులో ఇద్దరు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌పై ముస్లిం పర్సనల్ లా బోర్డు అఫిడవిట్ సమర్పించింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అఫిడవిట్ దాఖలు చేసిన పర్సనల్ లా బోర్డు.. మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం ఉందని తెలిపింది. సమూహ, ప్రత్యేక ప్రార్థనల్లో మహిళలు పాల్గొనడం తప్పనిసరి కాదని వివరించింది.
Last Updated : Feb 28, 2020, 11:06 AM IST