ప్రధాని నరేంద్రమోదీపై అభిమానాన్ని వినూత్నంగా చాటింది ఓ ముస్లిం మహిళ. తనకు పుట్టిన కుమారుడికి 'నరేంద్ర దామోదర దాస్ మోదీ' పేరు పెట్టాలని నిర్ణయించింది. అయితే కుటుంబ సభ్యులు ఆమె మనసు మార్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
ఉత్తరప్రదేశ్ గోండాలో జీవిస్తున్నారు మైనాజ్ బేగం. ఆమె భర్త ముస్తాక్ అహ్మద్ దుబాయిలో ఉంటున్నాడు. ఈ నెల 23న వారికి ఓ కుమారుడు జన్మించాడు. ఆ పిల్లాడికి మోదీ పేరు పెట్టాలని బేగం భీష్మించగా ముస్తాక్ వారించాడు. అతని తండ్రి ఇద్రీస్ కూడా ఆమె మనసు మార్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె పట్టు విడువలేదు. చివరికి పేరు నమోదుకు కుటుంబమంతా కలిసి స్థానిక పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ పత్రం సమర్పించారు.