ఇరు దేశాల మధ్య ఎన్ని రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా.. భారత్‌లో ఉండే ఓ హిందువుకు ఏటా రాఖీ పంపుతున్నారు పాకిస్థానీ మహిళ. 30 ఏళ్లుగా భారత్‌కు రాఖీ పంపుతున్నారంటే ఈ ముస్లిం- హిందువుల సోదరభావం ఎలాంటిదో మనమే అర్థం చేసుకోవాలి. మధ్యప్రదేశ్- హర్దా జిల్లాకు చెందిన పంకజ్ బఫ్నా(52)కు రక్షాబంధన్వచ్చిందంటే చాలు.. పాక్‌కు నుంచి పార్శిల్ వస్తుంది. ఆ కొరియర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తానని చెబుతున్నాడు పంకజ్.
షాహిదా చిన్నతనంలో ఓ సారి మధ్యప్రదేశ్‌కు రాగా.. అక్కడ తన బంధువుల తరఫునుంచి పంకజ్‌తో పరిచయం ఏర్పడిందన్నారు. అప్పటినుంచి ఏటా ప్రతి రక్షాబంధన్‌కు ఆయనకు రాఖీ పంపుతున్నాను అని చెప్పుకొచ్చారు షాహిదా.
'బాల్యంలో నేను ఓ సారి హర్దాకు వచ్చాను. అప్పుడు మా బంధువుల స్నేహితుడైన పంకజ్‌తో నాకు మంచి సోదరభావం ఏర్పడింది. అప్పటినుంచి తనకు ఏటా రాఖీ పంపుతున్నా. 2013లో పంకజ్‌కు స్వయంగా నేనే రాఖీ కట్టా. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఏడాది కూడా దిల్లీకి రావాలి అనుకున్నాను. కానీ కొవిడ్ కారణంగా రాలేకపోయాను.'