తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాకిస్థాన్​కు వ్యతిరేకంగా ముస్లింల నిరసనలు - Delhi muslims protests against pak

భారత ముస్లింలు పాకిస్థాన్​పై మండిపడ్డారు. దిల్లీ వీధుల్లో పాక్​కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పాకిస్థాన్‌లో యాజిద్ పేరిట నినాదాలు చేస్తున్నారంటే ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని అర్థమన్నారు భారత షియా మతాధికారులు.

Shia clerics in India protest against Pakistan
పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ముస్లింల నిరసనలు!

By

Published : Oct 3, 2020, 5:38 PM IST

పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత షియా ముస్లింలు దిల్లీ వీధుల్లో నిరసనలకు దిగారు. ముస్లిం మెజారిటీ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, మన దేశంలో పాకిస్థాన్ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని డిమాండ్ చేశారు.

షియా మతాధికారి కల్బే జావాద్ ఈటీవీ భారత్‌తో మాట్లాడుతూ.. యాజిద్‌కు మద్దతుగా నినాదాలు చేస్తోందంటే పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందనడానికి ఇదే సాక్ష్యమన్నారు. అందుకే, పాక్​ను అంతర్జాతీయంగా ఉగ్రవాద ప్రభుత్వంగా ప్రకటించాలని ఆయన కోరారు.

"ఇమామ్ హుస్సేన్ కుమారుడిని ఆకలితో, దాహంతో ఉంచిన వ్యక్తి యాజిద్. మదీనా మునావరాపై దాడి చేసి మహిళలను హింసించింది అతనే. పాకిస్థాన్‌లో అలాంటి వ్యక్తి కోసం నినాదాలు చేస్తున్నారు. పైగా తమను తాము ముస్లింలుగా పిలుచుకుంటున్నారు."

-కల్బే జావాద్, షియా మతాధికారి

భారతదేశంలోని పాకిస్థాన్ రాయబారులు తమకు క్షమాపణ చెప్పాలని లేదా పాక్ రాయబార కార్యాలయాన్ని భారత్ మూసివేయాలని డిమాండ్ చేశారు అఖిల భారత సూఫీ సజ్జాదన్షిన్ కౌన్సిల్ ఛైర్మన్ సయ్యద్ నసీరుద్దీన్ చిష్తీ.

ఇదీ చదవండి: 'ఇనుప కడాయి' ఫార్ములాతో రక్తహీనతకు చెక్!

ABOUT THE AUTHOR

...view details