తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాగ్ కొత్త అధిపతిగా ముర్ము ప్రమాణ స్వీకారం

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్​గా గిరీశ్ చంద్ర ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు.

CAG MURMU
ముర్ము

By

Published : Aug 8, 2020, 11:16 AM IST

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్​(కాగ్)గా గిరీశ్ చంద్ర ముర్ము బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు.

రాష్ట్రపతి సమక్షంలో..

ముర్మును సీఏజీగా నియమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆగస్టు 6న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు​ సీఏజీగా ఉన్న రాజీవ్ మెహర్షి శుక్రవారం పదవీ విరమణ చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ

ఎల్​జీగా రాజీనామా

జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బుధవారం సాయంత్రం ముర్ము రాజీనామా చేశారు. దీంతో ఆయన నూతన కాగ్​గా నియమితులవుతారని అప్పుడే ఊహాగానాలు వినిపించాయి.

ఇదీ చూడండి:జమ్ము కశ్మీర్​ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా- కారణమిదే!

ABOUT THE AUTHOR

...view details