గుజరాత్లో 12 ఏళ్ల బధిర బాలికపై వరుసకు సోదరుడయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అత్యంత కిరాతకంగా బాలిక ప్రాణాలు తీశాడు. బనాస్కాంఠా జిల్లాలోని డీసాలో ఈ ఘటన జరిగింది.
కజిన్పై అత్యాచారం- ఆపై తల, మొండెం వేరు చేసి.. - గుజరాత్ బనాస్కాంఠా జిల్లా రేప్ బధిర యువతి
గుజరాత్లో బధిర బాలికపై సొంత కజిన్ అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం బాలికను పాశవికంగా హత్య చేశాడు. తల, మొండెం వేరు చేసి ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బాలికను శుక్రవారం అపహరించి తీసుకెళ్లాడు నిందితుడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తల, మొండెం వేరై ఉన్న బాలిక మృతదేహాన్ని దంతివాడా తాలుకా వద్ద గుర్తించారు.
సీసీటీవీ ఫుటేజీ సహా ఇతర సమాచారం ఆధారంగా నిందితుడిని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. డీసాలోనే నివాసం ఉండే నితిన్ మాలిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలిలో మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. అత్యాచారం విషయం ఎవరికీ తెలియకూడదని నితిన్.. బాలిక గొంతు కోసి చంపాడని పోలీసులు వెల్లడించారు.