తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా మృతదేహాన్ని ఖననం చేస్తే.. కాలనీలోకి రానివ్వలేదు! - CORONA VIRUS DEATH INDIA

అసోంలోని బారక్​ లోయలో తొమ్మిదిమంది పారిశుద్ధ్య కార్మికులకు చేదు అనుభవం ఎదురైంది. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి మృతదేహానికి ఖననం చేశారని వారిని తమ ఇంటి వద్దకు అనుమతినివ్వలేదు కాలనీవాసులు. రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితిని అదుపు చేసి.. కాలనీవాసుల భయాన్ని పోగొట్టారు. చివరకు ఆ 9మందిని కాలనీలోకి అనుమతిచ్చారు.

Municipal workers face ordeal for burial of COVID 19 positive victim in Assam
కోరనా మృతదేహానికి ఖననం చేశారని కాలనీలోకి రానివ్వలేదు!

By

Published : Apr 11, 2020, 4:34 PM IST

కరోనా మృతదేహానికి ఖననం చేశారని కాలనీలోకి రానివ్వలేదు!

కరోనాపై పోరులో వైద్యులు, నర్సులు నిత్యం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారితో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ వంతు సహాయం చేస్తున్నారు. వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి మృతదేహాలను సొంత వారే చూడటానికి భయపడుతున్నారు. అలాంటిది ఆ మృతదేహాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖననం చేయటానికి ధైర్యంగా ముందుకొస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. కానీ సమాజంలో వారికి ఏదో విధంగా అవమానం జరుగుతూనే ఉంది. ఇందుకు అసోంలోని బారక్​ లోయలో జరిగిన ఘటనే ఉదాహరణ.

భయంతోనే...

అసోంలో ఇటీవలే తొలి కరోనా మరణం సంభవించింది. శుక్రవారం మృతదేహాన్ని ఖననం చేయడానికి కుటుంబ సభ్యులకు తొమ్మిది మంది పారిశుద్ధ్య కార్మికులు సహాయం చేశారు.

ఆ తర్వాత హైలకండిలో తాము నివాసం ఉండే నగపట్టి కాలనీకి బయలుదేరారు. కానీ కాలనీవాసులు ఈ 9 మందిని అడ్డుకున్నారు. వీరికీ కరోనా సోకి ఉంటుందన్న అనుమానం, భయంతో లోపలికీ అడుగుపెట్టనివ్వలేదు.

ఈ విషయం తెలుసుకున్న హైలకండి సర్కిల్​ ఆఫీసర్​ త్రిదిబ్​ రాయ్​.. పరిస్థితిని అదుపు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు మృతదేహానికి ఖననం చేస్తున్నప్పుడు తాము ఉన్నామని.. అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని స్థానికులకు వివరించారు. ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడానికి తొమ్మిది మందికి పరీక్షలు నిర్వహించారు. చివరికి కాలనీలోకి అనుమతినిచ్చారు స్థానికులు.

కాలనీవాసులతో సర్కిల్​ ఆఫీసర్​

ఇదీ చూడండి:-'ముగ్గురు భార్యలు, 12 మంది పిల్లలను పోషించలేకపోతున్నా'

ABOUT THE AUTHOR

...view details