జాతిపిత, మహాత్మ గాంధీజీపై ట్విట్టర్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు ముంబయికి చెందిన ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాంధీజీ విగ్రహాలను, భారత కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీ బొమ్మను తొలగించాలని ఆమె ట్వీట్ చేశారు.
గాంధీ పేరుతో ఉన్న సంస్థలకు, రోడ్లకు.. పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు.
క్షమించండి..
నిధి చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాడ్సేను ప్రస్తుతిస్తూ, మహాత్మునిపై అవమానకర ట్వీట్ చేసిన ఆమెను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.
స్పందించిన నిధి... తాను వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. వివాదాస్పద ట్వీట్‌ను తొలగించిన ఆమె.. క్షమాపణలు చెప్పారు.
"గాంధీజీని నేను ఎప్పుడూ విమర్శించలేదు. మహాత్ముడు మన జాతిపిత. 2019లో ఈ దేశ అభివృద్ధికోసం మనమంతా కృషి చేయాల్సి ఉంది. నా ట్వీట్లను తప్పుగా అర్థం చేసుకున్నవారు అది వ్యంగ్యమని గ్రహిస్తారని ఆశిస్తున్నాను."- నిధి చౌదరి, ఐఏఎస్ అధికారిణి
మహాత్మునిపై ఐఏఎస్ అధికారిణి విమర్శలు, క్షమాపణలు
నిధి చౌదరి.. ప్రస్తుతం బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. గాంధీజీ రాసిన సత్యశోధన (మై ఎక్స్పెరిమెట్స్ విత్ ట్రూత్) తనకు అత్యంత ఇష్టమైన పుస్తమని ఆమె పేర్కొనడం విశేషం.
ఇదీ చూడండి: అడిగితే ఇవ్వలేదు... ఇస్తే తీసుకోలేదు