తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర: ముంచెత్తిన వర్షం- జనజీవనం అస్తవ్యస్తం

మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.  రాష్ట్రంలోని ప్రధాన నగరాలు సహా గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వృక్షాలు, విద్యుత్​ స్తంభాలు నేలకొరిగాయి. జన జీవనం అతలాకుతలమయింది.

By

Published : Jul 1, 2019, 9:45 AM IST

Updated : Jul 1, 2019, 11:55 AM IST

మహారాష్ట్ర: ముంచెత్తిన వర్షాలు-స్తంభించిన జనజీవనం

మహారాష్ట్ర: ముంచెత్తిన వర్షం- జనజీవనం అస్తవ్యస్తం

మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

రైళ్లు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సియోన్​, మతుంగ స్టేషన్లలో రైల్వే పట్టాలపై భారీగా వరద నీరు చేరి రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నగరంలోని చెంబూర్​, తూర్పు దాదర్​, కింగ్స్​ సర్కిల్​ వంటి ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలచింది. చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు వరద నీటిలో ఇబ్బందులు పడుతున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: శాంతించిన సూర్యుడు- ఉత్తరాదిలో జోరుగా వర్షాలు

Last Updated : Jul 1, 2019, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details