తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2020, 4:10 PM IST

Updated : Sep 23, 2020, 4:55 PM IST

ETV Bharat / bharat

వానలకు వణికిన ముంబయి- బంగాల్​కూ భారీ వర్ష సూచన

మహారాష్ట్రలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయి సహా పలు నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బంగాల్​లోనూ సెప్టెంబర్​ 23-25 మధ్య భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. సిక్కింలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి.

Mumbai rains: Five teams of NDRF on standby,says Maha minister
వానలకు వణికిన ముంబయి.. బంగాల్​కూ భారీ వర్షసూచన

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ముంబయితో పాటు ఠాణే, పాల్ఘర్​లో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలు చోట్ల పట్టాలపైకి నీళ్లు చేరి.. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రోడ్డుపై భారీగా చేరిన నీరు
ఆస్పత్రిలోకి చేరిన నీరు

సహాయక చర్యల నిమిత్తం.. అదనంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను(ఎన్​డీఆర్​ఎఫ్​) సిద్ధంగా ఉంచినట్లు స్పష్టం చేశారు మంత్రి విజయ్​ వాడేట్టీవార్​. ప్రజల్ని ఇళ్లలోంచి బయటకు రావొద్దని సూచించారు.

పరిస్థితిని సమీక్షిస్తున్న ముంబయి కమిషనర్​

బంగాల్​కు భారీ వర్షసూచన..

బంగాల్​లో బుధవారం నుంచి శుక్రవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది. డార్జిలింగ్​, కాలింపోడ్​ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశాలున్నట్లు తెలిపింది. నదులు ఉద్ధృతంగా ప్రవహించవచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

వర్షంలోనూ ప్రయాణం

ఇప్పటికే కుమార్​గ్రామ్​, దామోహినీ ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షం కురిసిందని ప్రాంతీయ వాతావరణ విభాగం డైరెక్టర్​ జీకే దాస్​ తెలిపారు. కోల్​కతాలో 2 రోజులు సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

యూపీలోనూ..

ఉత్తర్​ప్రదేశ్​లోనూ మంగళవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. చిత్రకూట్​లోని కర్వీలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

యూపీలో భారీ వర్షాలు

గురువారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు.. పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించారు అధికారులు.

సిక్కిం ప్రధాన రహదారిపై..

భారీ వర్షాల కారణంగా బంగాల్​ నుంచి సిక్కిం వెళ్లే పదో నెంబర్​ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాకాలంలో.. ఈ రోడ్డుపై ప్రయాణాలు చేయడం చాలా ప్రమాదమని స్థానికులు అంటున్నారు.

భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు
రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు
Last Updated : Sep 23, 2020, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details