తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ముంబయిలో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఎడతెరిపి లేని వర్షాలతో విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

By

Published : Jun 28, 2019, 7:23 PM IST

ముంబయిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ముంబయిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రవాణా సేవలకు తీవ్ర అంతరాయం కలిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

రేపటి వరకూ ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. మహారాష్ట్రలోని గ్రేటర్ ముంబయి, థానే, పాల్ఘర్​, రత్నగిరిల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

ప్రస్తుతం ముంబయి నగర ప్రాంతాలతో పాటు శివార్లలోని విహార్​, జుహు, ములుంద్​ల్లోనూ భారీగా వర్షం పడుతోంది. వాతావరణం అనుకూలించక అధికారులు కొన్ని విమాన సర్వీసులను నిలిపివేశారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైలు సర్వీసులు నిలిచిపోకుండా ప్రత్యేక రైల్వే బృందాలు రంగంలోకి దిగాయి.

ఇదీ చూడండి: హైడ్రోమాన్: నీళ్లలో మునిగి అద్భుత నృత్యాలు

ABOUT THE AUTHOR

...view details