మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైదా బస్తాల లోడుతో వచ్చిన ఓ టెంపో.. రోడ్డు పక్కన బైక్‌లపై నిల్చున్న వ్యక్తులపై పడిపోయింది. రాయ్‌గఢ్ జిల్లా పుణె-ముంబయి జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి గాయాలయ్యాయి.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి - mumbai pune expressway accident,
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పుణె- ముంబయి జాతీయ రహదారిపై ఖండాలా ప్రాంతం వద్ద అదుపుతప్పిన ఓ టెంపో.. రోడ్డు పక్కన నిల్చున్న ద్విచక్ర వాహనాలపై పడింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
వివరాల ప్రకారం.. అలీబాగ్ నుంచి తలేగావ్‌కు బైక్‌లపై వెళ్లిన ఆరుగురు వ్యక్తులు తిరుగుప్రయాణంలో ఖోపోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ మలుపు వద్ద ఆగారు. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ టెంపో అదుపుతప్పి వీరిపై పడినట్లు సమాచారం. ట్రక్కు కింద నలిగిపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి కాస్త దూరంలో ఉన్న మరో వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఘటన అనంతరం.. ఆ వాహనం డ్రైవర్ పరారుకాగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:ఘర్షణలతో జనజీవనం అస్తవ్యస్తం.. రిక్షా కార్మికుడే నిదర్శనం!