వేల మంది వలస కార్మికులు ఒక్కసారిగా ముంబయి బాంద్రా రైల్వే స్టేషన్‌కు తరలిరావడం ఉద్రిక్తతలకు దారితీసింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది.
ఇదీ జరిగింది..
వేల మంది వలస కార్మికులు ఒక్కసారిగా ముంబయి బాంద్రా రైల్వే స్టేషన్‌కు తరలిరావడం ఉద్రిక్తతలకు దారితీసింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది.
ఇదీ జరిగింది..
బిహార్‌కు చెందిన వలస కూలీల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక్ రైలు ఏర్పాటు చేసింది. ఈ రైలులో బాంద్రా నుంచి పూర్ణియా వెళ్లేందుకు 1000 మంది రిజర్వేషన్ చేయించుకున్నారు. అయితే... టికెట్ లేకపోయినా ముంబయిలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వలస కార్మికులు ఒక్కసారిగా బాంద్రా స్టేషన్‌కు తరలివచ్చారు. రైలులో ప్రయాణించేందుకు తమను కూడా అనుమతించాలని నిరసనకు దిగారు.
ఈ హఠాత్ పరిణామంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రిజర్వేషన్ ఉన్నవారిని మాత్రమే రైలు ఎక్కేందుకు అనుమతించారు. మిగిలినవారిని అక్కడి నుంచి చెదరగొట్టారు.