తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యాపారస్థుడిని అపహరించిన నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్​ - ముంబయి పోలీసులు

గుజరాత్​కు చెందిన ఓ వ్యాపారస్థుడిని అపహరించి రూ. 15 లక్షలు వసూలు చేసిన నకిలీ ఐపీఎస్ అధికారిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. అతడిని బెంగళూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కోర్టు అనుమతితో రిమాండ్​కు తరలించారు.

Mumbai police nabs fake IPS officer who abducted businessman, extorted money
వ్యాపారస్థుడిని అపహరించిన నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు

By

Published : Oct 11, 2020, 12:26 PM IST

ఐపీఎస్​ అధికారినంటూ వేషం వేసి గుజరాత్​ వ్యాపారస్థుడిని మోసం చేసిన ఓ వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన ఎస్​ఎస్ శర్మగా గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని రిమాండ్​కు తరలించారు.

గుజరాత్​ సూరత్​కు చెందిన వ్యాపారస్థుడిని ఓ పని కోసం సంప్రదించాడు ఎస్​ఎస్ శర్మ. తాను ఐపీఎస్ అధికారినని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్త్ర సరుకును ముంబయి ఓడరేవు నుంచి తీసుకురావాలని తెలిపాడు. ఈ మాటలు నమ్మిన వ్యాపారస్థుడు ముంబయి వెళ్లాడు. ఆ తర్వాత అతడిని అపహరించి సూరత్​కు తీసుకెళ్లాడు నకిలీ ఐపీఎస్​ అధికారి. వ్యాపారస్థుడి వద్ద నుంచి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ సహా రూ.15లక్షల నగదు వసూలు చేసి పారిపోయాడు.

తాను మోసపోయానని తెలుసుకున్న వ్యాపారస్థుడు ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని రాజస్థాన్​లో అరెస్టు చేశారు. కోర్టు ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి అక్టోబర్ 13 వరకు రిమాండ్ విధించింది.

ABOUT THE AUTHOR

...view details