నిసర్గ తుపాను ఇవాళ మధ్యాహ్నం 1గంట నుంచి 3 గంటల మధ్య రాయ్‌గఢ్ జిల్లాలోని అలీబాగ్ వద్ద తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ తుపాను తీరం దాటే సమయంలో 110 కి.మీ నుంచి 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం
మహారాష్ట్ర తీర ప్రాంతాలైన ముంబయి సహా రత్నగిరి, పాల్ఘర్, సింధు దుర్గ్, రాయ్‌గఢ్, థానే జిల్లాలపై నిసర్గ ప్రభావంఉంటుందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముంబయి విమానాశ్రయం వద్ద హై అలర్ట్ ప్రకటించారు. కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు.
144 సెక్షన్
ముంబయిలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని బృహత్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ సూచించింది. తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రెండు రోజుల పాటు ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జాగ్రత్తలు పాటించండి
నిసర్గ తుపాను నుంచి ప్రజలు సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనల జాబితా విడుదల చేసింది.
పోటెత్తుతున్న అలలు