తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డ్రగ్స్​ ముఠా గుట్టురట్టు- దావూద్​ అనుచరుడు అరెస్ట్​ - ఎన్​సీబీ న్యూస్​

మహారాష్ట్రలో నిషేధిత మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. పక్కా సమచారంతో దక్షిణ ముంబయిలో దాడులు నిర్వహించిన అధికారులు.. 12కిలోల మత్తు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Mumbai: NCB seizes over 12 kg of drugs, firearm from home lab
డ్రగ్స్​ ముఠా గుట్టురట్టు- దావూద్​ అనుచరుడు అరెస్ట్​

By

Published : Jan 21, 2021, 8:05 PM IST

దక్షిణ ముంబయిలోని డోంగ్రి ప్రాంతంలో 12కిలోల నిషేధిత మత్తు పదార్థాలు, ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పక్కా సమాచారంతో డోంగ్రిలోని హోం లేబొరేటరిలో సోదాలు నిర్వహించిన మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో అధికారులు.. మత్తు పదార్థాలతో పాటు రూ. 2.18 కోట్లు విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనలో అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీంతో సంబంధాలున్న గ్యాంగ్​స్టర్​ పర్వేజ్​ ఖాన్​ అలియాస్​ చింకూ పథాన్​ను అరెస్టు చేశారు. పర్వేజ్​ ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు.. 52.2 గ్రాముల మాదకద్రవ్యాలు, 9ఎంఎం తుపాకీని​ స్వాధీనం చేసుకున్నారు. థానే జిల్లాలోని పర్వేజ్​ అనుచరులు ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అవిభక్త పిల్లులకు శస్త్రచికిత్స సక్సెస్​

ABOUT THE AUTHOR

...view details