మహారాష్ట్ర ముంబయి మహానగరంలోని సిటీ సెంటర్ మాల్ అగ్ని ప్రమాదంలో మంటలు అదుపు చేసే చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం రాత్రి 8.53 గంటల ప్రాంతంలో భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగగా.. 36 గంటలుగా మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 18 అగ్నిమాపక యంత్రాలు, 10 జంబో ట్యాంకుల సాయంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు అధికారులు.
"ఈ ప్రమాదంలో స్థానికులు గాయపడినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. జ్వాలలను అదుపు చేస్తున్న క్రమంలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది, ఓ అధికారికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగా ఉన్నారు. చికిత్స తీసుకుని డిశ్చార్జి అయ్యారు."
- అగ్నిమాపక అధికారులు