కరోనా ఔషధం పేరిట దేశీయ ఆయుర్వేద సంస్థ పతంజలి తీసుకొచ్చిన 'కరోనిల్' మందు అమ్మకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమలులోకి వస్తుందని తెలిపింది.
ఈ ఔషధం నకిలీదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. పతంజలి అసలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిందో లేదో జైపుర్ నిమ్స్ నిగ్గు తేల్చుతుందని ట్వీట్ చేశారు. నకిలీ మందుల అమ్మకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించదంటూ రాందేవ్ బాబాను హెచ్చరించారు.
మంత్రి వ్యాఖ్యలపై భాజపా ఎమ్మెల్యే రామ్‌దాస్ కదమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చికిత్స కోసం తయారు చేసిన ఔషధాన్ని ఎలాంటి తనిఖీలు చేయకుండా నకిలీదని ఎలా తీర్మానిస్తారని ప్రశ్నించారు. బాబా రాందేవ్ ఎప్పటినుంచో దేశానికి సేవచేస్తున్నారని అన్నారు.