దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న రెండోదశ లాక్డౌన్ మే 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. తదుపరి ఎలా ముందుకెళ్లాలన్న అంశాలపై చర్చించి జోన్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. తాజాగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల జాబితాను సవరించింది. దేశ రాజధాని దిల్లీ సహా మెట్రోపాలిటన్ నగరాలైన ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్ రెడ్‌జోన్‌లోనే ఉన్నాయని ప్రకటించారు అధికారులు. లాక్డౌన్ తర్వాత వారం రోజుల వరకు ఇది అమల్లో ఉండనుందని తెలిపారు. దీని ప్రకారం.. ఈ రెడ్జోన్లలో లాక్డౌన్ కొనసాగించేందుకే ప్రధాని మొగ్గుచూపనున్నట్లు తెలుస్తోంది.
130 జిల్లాలు రెడ్లోనే...
ఆయా ప్రాంతాల్లో కొవిడ్ వ్యాప్తి, రెట్టింపు రేటు, టెస్టింగ్ సదుపాయాలు, అధికారుల చర్యలు ఆధారంగా జోన్లను విభజించింది కేంద్రం. దేశవ్యాప్తంగా 733 జిల్లాల్లో... 130 జిల్లాలు రెడ్‌జోన్‌లో, 284 ఆరెంజ్ జోన్లో ఉండగా.. గ్రీన్జోన్లో 319 జిల్లాలున్నాయి.