సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆసుపత్రిలో చేరారు. మూడురోజులుగా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ములాయం వైద్యుల సూచన మేరకు ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ములాయం - YADAV HOSPITALISED
స్వల్ప అనారోగ్యం కారణంగా ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని సమాచారం. ఈరోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ములాయం
ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈరోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. 80 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్.. యూపీ సీఎంగా, మాజీ రక్షణ మంత్రిగానూ దేశానికి సేవలందించారు.
ఇదీ చూడండి: బూడిద రంగులో కేరళ అడవులు.. కారణం సీతాకోకచిలుకలు!