తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హజ్‌ యాత్రపై తొలగని అనిశ్చితి

2021లో నిర్వహించనున్న హజ్​యాత్రపై సందిగ్ధం నెలకొంది. దీనిపై భారత్‌ సహా సౌదీ అరేబియా నుంచి కొవిడ్‌-19 తుది మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ స్పష్టం చేశారు.

Mukhtar Abbas Naqvi says haj-2021 will depend on national international covid-19 protocols
హజ్‌ యాత్రపై కేంద్రం సందిగ్ధత

By

Published : Oct 20, 2020, 6:45 AM IST

వచ్చే ఏడాది నిర్వహించనున్న హజ్‌ యాత్రపై.. భారత్‌ సహా సౌదీ అరేబియా నుంచి కొవిడ్‌-19 తుది మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ స్పష్టంచేశారు. హజ్‌ సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన.. ఈ మేరకు తెలిపారు.

2021 సంవత్సరానికిగాను జూన్‌ -జులై నెలల్లో హజ్‌ యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రయాణికుల క్షేమం దృష్ట్యా కొవిడ్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. యాత్రికుల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యమని నఖ్వీ తెలిపారు. కరోనా కారణంగా ఈ ఏడాది హజ్‌ యాత్రను విరమించుకున్న సుమారు 1.23 లక్షల మందికి వారు చెల్లించిన సొమ్ము రూ.2,100 కోట్లను.. ఎలాంటి కోతలూ విధించకుండా తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.

ఇదీ చూడండి:కమల్​నాథ్ అనుచిత వ్యాఖ్యలపై నివేదిక కోరిన ఈసీ

ABOUT THE AUTHOR

...view details