మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడినట్లు దిల్లీ ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శ్వాసకోశ సంబంధిత పరామితులు కాస్త మెరుగైనట్లు తెలిపాయి.
"ప్రణబ్‌కు ప్రస్తుతం వెంటిలేటర్ సహకారంతోనే చికిత్స అందిస్తున్నాం. కీలకమైన వైద్య సూచీలు స్థిరంగా ఉన్నాయి. ప్రత్యేక నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోంది."
-ఆస్పత్రి ప్రకటన
ముఖర్జీ ఆగస్టు 10న ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. అదేరోజు ఆయనకు మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స నిర్వహించారు. ముఖర్జీకి అంతకుముందే కరోనా సోకినట్లు తేలింది. మరోవైపు బుధవారం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకినట్లు ఆస్పత్రి వెల్లడించింది.
2012 నుంచి 2017 వరకు భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలందించారు.
ఇదీ చదవండి-దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరమిదే..