మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రణబ్‌కు వెంటిలేటర్ సాయంతోనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కీలకమైన పారామితులు స్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు.
ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ప్రకటన - pranab mukherjee health
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో చేరారు ప్రణబ్. శస్త్రచికిత్స జరిగిన అదే రోజు ప్రణబ్‌కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఇదీ చూడండి:'ఆ వార్తలు అవాస్తవం.. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది'