కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ బుజ్జగింపు ప్రయత్నాలు మళ్లీ మొదటికి వచ్చాయి. కాంగ్రెస్‌లో కొనసాగుతానన్న మంత్రి ఎంటీబీ నాగరాజు నిర్ణయాన్ని మార్చుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలతో కలిసేందుకు ముంబయి బయలుదేరారు.
నాగరాజు నిర్ణయంతో అసంతృప్తుల శిబిరంలో ఎమ్మెల్యే సుధాకర్ కూడా చేరే అవకాశం ఉంది.
చర్చలు వృథా...
నాగరాజు రాజీనామా నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ మధ్యాహ్నం వరకు మంతనాలు జరిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభాపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంట్లో నాగరాజుతో చర్చలు సాగాయి.
ఈ చర్చల్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కేపీసీసీ సారథి దినేశ్ గుండురావుతో పాటు ముఖ్యమంత్రి కుమారస్వామి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పదవికి ఇచ్చిన రాజీనామాను వెనక్కితీసుకోవడం సహా కాంగ్రెస్‌లోనే కొనసాగేలా నాగరాజును ఒప్పించారు.
ఈ విషయంలో విజయం సాధించారని సంతోషించేలోపు నాగరాజు మళ్లీ మనసు మార్చుకుని కూటమి ఆశలపై నీళ్లు చల్లారు.
ఇదీ చూడండి: కర్ణాటకీయం: బుజ్జగింపుల్లో కూటమి- ధీమాగా భాజపా