కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధిస్తూ కేంద్రం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది.
ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ సోమవారమే ఆమోదించింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌ను బిల్లుగా మార్చనున్నారు.
ఎంపీల నియోజకవర్గం, కార్యాలయానికి సంబంధించిన భత్యాల్లో(అలవెన్సు)నూ కోత విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల ఒక్కో ఎంపీకి నెలకు రూ.27,000 మేర భత్యం తగ్గనుంది. ఎంపీలకు నియోజకవర్గ భత్యం కింద ఇచ్చే రూ.70,000లో 30శాతం లెక్కన.. రూ.21,000 కోత విధించనున్నారు. అలాగే స్టేషనరీ అలవెన్సు రూ. 20వేలను రూ. 14వేలకు తగ్గించారు. పీఏలకు ఇచ్చే రూ.40వేలలో మాత్రమే ఎలాంటి కోత విధించలేదు. కమిటీ సిఫార్సులను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓమ బిర్లా ఆమోదించారు. ఈ నెల 1 నుంచే ఇది అమల్లోకి వస్సుంది.
వేతనాలు ఇలా..
లోక్‌సభలో 543, రాజ్యసభలో 245 మంది ఏంపీలున్నారు. సాధారణంగా ఎంపీలకు వేతనాల రూపంలో నెలకు రూ. లక్ష అందాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ నుంచి రూ. 70వేలు మాత్రమే పొందనున్నారు. ఏడాది పాటు వేతనాల్లో కోత ఉండనుంది.