కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లు చేయాలని ఉభయ సభల ప్రధాన కార్యదర్శులు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. లోక్సభ ఒకరోజు రాజ్యసభ మరో రోజు కాకుండా రెండు సభలనూ ఏకకాలంలో, యథాస్థానాల్లోనే నిర్వహించే అవకాశాలున్నట్లు అధికారిక వర్గాలు చెప్పాయి.
కరోనా నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల ఏర్పాటుకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు శనివారం చర్చించారు.
పార్లమెంటు గ్రంథాలయ భవనంలోని బాలయోగి ఆడిటోరియం, సెంట్రల్ హాల్, ఉభయ సభల గ్యాలరీలు, లాబీలను సమావేశాల ఏర్పాటు కోసం పరిశీలిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.