తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చౌకీదార్​ చోర్​హై' ప్రచార వీడియోపై ఈసీ నిషేధం - chowkidar

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ ప్రచార వీడియోపై ఎన్నికల సంఘం అధికారులు నిషేధం విధించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా వర్తిస్తుందని తెలిపారు. 'చౌకీదార్‌ చోర్‌ హై' అంటూ మధ్యప్రదేశ్​లో ఓ ప్రచార వీడియోను కాంగ్రెస్ విడుదల చేసింది.

ప్రచార వీడియోపై నిషేధం

By

Published : Apr 19, 2019, 7:31 AM IST

Updated : Apr 19, 2019, 8:07 AM IST

ప్రచార వీడియోపై నిషేధం

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ విడుదల చేసిన ప్రచార వీడియోపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. 'చౌకీదార్​ చోర్​ హై' అనే ప్రచార వీడియోపై దేశవ్యాప్తంగా నిషేధం ఉంటుందని రాష్ట్ర సంయుక్త ఎన్నికల అధికారి రాజేశ్ కౌల్​ స్పష్టం చేశారు. తక్షణమే దీన్ని నిలిపి వేయాల్సిందిగా ఆదేశించారు.

‘నేను దేశానికి చౌకీదార్‌’ అంటూ ప్రధాని మోదీ చెప్పిన మాటలను వక్రీకరించారని భాజపా ఆరోపించింది. మోదీని వ్యక్తిగతంగా విమర్శించేందుకే కాంగ్రెస్‌ ఈ వీడియోను రూపొందించిందని తెలిపింది. అయితే వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్‌ వాదిస్తోంది.

దుమారం చెలరేగడం వల్ల వీడియోపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈసీ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల అధికారులకు సమాచారమిచ్చారు రాజేశ్ కౌల్. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను కాంగ్రెస్‌ పార్టీపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీఎల్‌ కాంతారావు తెలిపారు.

ఇదీ చూడండి:శ్రీనగర్​లోని 90 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శూన్యం!

Last Updated : Apr 19, 2019, 8:07 AM IST

ABOUT THE AUTHOR

...view details