తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ వేళ నడిరోడ్డుపై గుంజీలు- అసలేం జరిగింది? - కరోనా వైరస్​ ఇండోర్​

లగ్జరీ కారులో ప్రయాణిస్తున్న ఓ 20ఏళ్ల యువకుడిని ఓ వాలంటీర్​ అడ్డుకుని అతడితో రోడ్డుపైనే ​గుంజీలు తీయించిన ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అయితే ఆకలితో ఉన్న వారికి ఆహార పొట్లాలు అందించి వెనుదిరుగుతున్న సమయంలో తనను ఆ వాలంటీర్​ అడ్డుకున్నట్టు ఆ యువకుడు పేర్కొన్నాడు.

MP: Man moving in luxury car during curfew made to do sit-ups
లాక్​డౌన్​ వేళ నడిరోడ్డుపైనే గుంజీలు- అసలేం జరిగింది?

By

Published : Apr 26, 2020, 8:26 PM IST

లాక్​డౌన్​ వేళ నడిరోడ్డుపై గుంజీలు- అసలేం జరిగింది?

లాక్​డౌన్​ వేళ లగ్జరీ కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడిని వాలంటీర్​ అడ్డుకున్నాడు. అతడిని కారులో నుంచి కిందికి దింపి.. రోడ్డుపైనే గుంజీలు తీయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. అయితే తన వద్ద పాస్​ ఉన్నప్పటికీ ఆ వాలంటీర్​ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ వ్యక్తి ఆరోపించాడు.

ఇదీ జరిగింది...

నగర్​ సురక్షా సమితి బృందంలోని ఓ వాలంటీర్​.. 20ఏళ్ల వ్యక్తితో రోడ్డుపై గుంజీలు తీయించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

నల్ల దుస్తులు ధరించిన ఆ వాలంటీర్​.. కారులో ఉన్న వ్యక్తిని కిందకి దిగమని అడగడం ఆ వీడియోలో కనపడింది. అదే సమయంలో ఆ యువకుడు తన వద్ద ఉన్న పాస్​ను చూపించడం అందులో రికార్డ్​ అయ్యింది.

తనకు పాస్​తో సంబంధం లేదన్న ఆ వాలంటీర్​.. చివరికి ఆ వ్యక్తి చేత గుంజీలు తీయించాడు. అతడి ముఖానికి మాస్కులు లేకపోవడం చూసి ప్రశ్నించాడు.

ఈ విషయంపై బాధితుడు మరో వీడియో తీసి వివరణ ఇచ్చాడు. తాను ఇండోర్​లోని ఓ పారిశ్రామికవేత్త కుమారుడినని, తన వద్ద పాస్​ ఉన్నట్టు చెప్పినప్పటికీ ఆ వాలంటీర్​ వినలేదని ఆరోపించాడు. ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహార పొట్లాలను పంపిణీ చేసి ఇంటికి వెళ్తున్నట్టు చెప్పినా లెక్కచేయలేదన్నాడు. తనపై అసభ్య పదజాలం వాడినట్టు తెలిపాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ పారిశ్రామికవేత్త.. తనకు కూడా ఇలాంటి సంఘటనే ఎదురైందని చెప్పుకొచ్చారు. అప్పుడు కూడా నగర్​ సురక్షా సమితి సభ్యులే తనపై అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. ఈ విషయాన్ని హీరా నగర్​ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్టు స్పష్టం చేశారు.

ఈ పుర్తి వ్యవహారంపై హీరా నగర్​ పోలీస్​ స్టేషన్​ ఇన్​ఛార్జ్​ రాజివ్​ భడోరియా స్పందించారు. వైరల్​​ వీడియోకు సంబంధించిన సమాచారం తమకు అందిందన్నారు. వీడియోను పరిశీలించిన తర్వాతే చర్యలు చేపడతామన్నారు.

లాక్​డౌన్​ కారణంగా అనేకమంది నగర్​ సురక్షా సమితి వాలంటీర్లతో పోలీసు సిబ్బంది కలిసి పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు భడోరియా. అయితే సామాన్యులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- వాట్సాప్​ స్టేటస్​లో కరోనా బాధితుల ఫొటో- చివరికి..

ABOUT THE AUTHOR

...view details