పోలీసు కుక్కల బదిలీ వ్యవహారం మధ్యప్రదేశ్‌లో రాజకీయ వివాదంగా మారింది. కమల్‌నాథ్ ప్రభుత్వం ఇటీవల 46 మంది పోలీసు శునకాల శిక్షకులను వారి కుక్కలతో సహా బదిలీ చేసింది. 23వ బెటాలియన్ డాగ్ స్క్వాడ్‌కు చెందిన ట్రాకర్, స్నిఫ్ఫర్, నార్కో కుక్కలతో పాటు వాటి శిక్షకులను వివిధ జిల్లాలకు పంపింది. వారు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది.
సీఎం నివాసానికి కుక్కల తరలింపు..
తాజా బదిలీల్లో చింద్వారా, సత్నా, బెతుల్ నుంచి మూడు స్నిఫ్ఫర్ కుక్కలను భోపాల్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి తరలించారు. ఈ అంశాన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకున్న భాజపా... కమల్‌నాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.
"ఘనత వహించిన కమల్‌నాథ్ ప్రభుత్వం ఆఖరికి కుక్కలనూ వదిలిపెట్టకుండా బదిలీలు చేస్తోంది."
- విజేశ్ లూనావత్, మధ్యప్రదేశ్ రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు