మధ్యప్రదేశ్ బాలాఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మరణించినవారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న ముగ్గురు మహిళలు సహా ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. చనిపోయినవారిని.. సవిత (35), సునీత (40), యశోద (42), అరుణ్ (22)లుగా గుర్తించారు పోలీసులు.