తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి - road accident news mp

మధ్యప్రదేశ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్​ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా వారణాసి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

MP: Five of family killed in road accident
మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Dec 21, 2020, 11:12 PM IST

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్​ శివని వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

టోల్​గేట్​ దగ్గర రుసుం చెల్లించడానికి ఆగి ఉన్న ఆయిల్​ ట్యాంకర్​ను వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. కారులోని వారంతా ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన జరిగిందని వివరించారు. క్షతగాత్రులను స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: చిన్నారి హత్యాచార కేసులో నిందితునికి మరణశిక్ష

ABOUT THE AUTHOR

...view details