తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోవాలో సున్నా.. మహారాష్ట్రలో 2,091 మందికి కరోనా - దేశంలో కరోనా తాజా వార్త

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో వైరస్​ కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఈరోజు 2,091 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు- 646, దిల్లీ- 412, గుజరాత్- 361, రాజస్థాన్- 176, కేరళ- 67 మందికి వైరస్​ నిర్ధరణయింది.

MP COVID-19 cases rise by 194 to 6,859; death toll 300
నేడు గోవాలో సున్నా... మహారాష్ట్రలో 2,091 మందికి కరోనా

By

Published : May 26, 2020, 10:55 PM IST

దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. అత్యధిక కేసుల జాబితాలో మహరాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా ​తమిళనాడు, గుజరాత్​, దిల్లీ, రాజస్థాన్​ రాష్ట్రాలు నిలిచాయి.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో కరోనా నియంత్రణకు ఎన్ని కట్టిడి చర్యలు చేపట్టినా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ఈ రోజు రికార్డు స్థాయిలో 2,091 మందికి వైరస్​ సోకింది. మరో 97 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 54,758 మంది వైరస్​ బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,792 మహమ్మారికి బలయ్యారు. మొత్తం 36,004 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

తమిళనాడులో...

తమినాడులోనూ కరోనా కోరలు చాచుతోంది. కొత్తగా 646 కేసులు నమోదు కాగా... మొత్తం బాధితుల సంఖ్య 17,728కి చేరింది. వీరిలో 8,256 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 127 మంది ప్రాణాంతక వైరస్​ కారణంగా మృతి చెందారు.

దిల్లీలో...

దేశ రాజధాని దిల్లీలో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 412 మందికి వైరస్​ సోకినట్లు యంత్రాంగం ప్రకటించింది. దీంతో మొత్తం వైరస్​ పాజిటివ్​ కేసుల సంఖ్య 14,465కు ఎగబాకింది. మరో 186 మంది డిశ్చార్జ్​ కాగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,654 చేరింది. మరో 7,223 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గుజరాత్​లో...

గుజరాత్​లో​ నేడు 361 మంది వైరస్​ బారిన పడగా, మొత్తం కేసులు సంఖ్య 14,829కి చేరింది. ఈ రోజు 27 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 915 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,137 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకోగా... 6,777 మంది చికిత్స పొందుతున్నారు.

కర్ణాటకలో...

కర్ణాటకలో కరోనా వైరస్ బాధితులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. తాజాగా 101 మంది వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. దీంతో మొత్తం 2,283 మంది మహమ్మారి బారిన పడినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది వైరస్​కు బలయ్యారు.

  • కేరళలో మళ్లీ కేసులు పెరిగిపోతున్నాయి. కొత్తగా 61 కేసులు నమోదయ్యాయి. మొత్తం 963 వైరస్ బారిన పడ్డారు. వీరిలో 415 మంది చికిత్స పొందుతుండగా... రాష్ట్ర వ్యాప్తంగా 1.4 లక్షల మంది పరీశీలనలో ఉన్నారు.
  • ఛత్తీస్​గఢ్​లో మరో 15 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణయింది. దీంతో వైరస్​ బాధితుల సంఖ్య 307కు ఎగబాకింది.
  • ఉత్తరాఖండ్​లో ఇవాళ కేవలం ఒక కేసు మాత్రమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం కేసులు సంఖ్య 401కి చేరినట్లు వెల్లడించారు.
  • గోవాలో ఈ రోజు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మొత్తం 9 మంది డిశ్చార్జ్​ కాగా.. 39 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు ప్రకటించారు.

ఇదీ చూడండి:పాముతో భార్యను చంపింది.. అందుకోసమే!

ABOUT THE AUTHOR

...view details