మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు ప్రముఖ ప్రచార కర్త హోదాను రద్దు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. పదే పదే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
కమల్‌కు ఈసీ షాక్.. ప్రచారకర్త హోదా రద్దు - madhyapradesh latest news
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్‌కు గట్టి షాకిచ్చింది ఎన్నికల సంఘం. ఇప్పటివరకు ఉన్న ప్రముఖ ప్రచార కర్త హోదాను ఇవాళ రద్దు చేసింది.
![కమల్‌కు ఈసీ షాక్.. ప్రచారకర్త హోదా రద్దు kamalnath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9371004-859-9371004-1604071931349.jpg)
కమల్‌నాథ్
మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున కమల్‌నాథ్ ప్రముఖ ప్రచారకర్తగా ఉన్నారు. తాజాగా ఎన్నికల సంఘం ఆ హోదాను రద్దు చేసినందున ఇకపై కమల్‌నాథ్ ఎక్కడకు ప్రచారానికి వెళ్లినా.. ప్రయాణం, వసతి తదితర ఖర్చులను ఆయా నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థులు భరించాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి:'మేం గెలిస్తే మాజీ సీఎం కుమారులు పదో తరగతి పాస్!'