తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విధులను విస్మరించి వాట్సాప్​ చాటింగ్​ చేసినందుకు... - వాట్సాప్​ చాటింగ్​

విధుల్లో ఉండగా వాట్సాప్​లో చాటింగ్ చేశారన్న కారణంతో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

వాట్సాప్ చాటింగ్​కు ఐదుగురు పోలీసుల బలి..!

By

Published : Nov 10, 2019, 4:36 PM IST

Updated : Nov 10, 2019, 5:52 PM IST

అయోధ్య తీర్పు నేపథ్యంలోమధ్యప్రదేశ్​లోని సున్నిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ.. వాట్సాప్​ను వినియోగించిన ఐదుగురు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

జబల్​పుర్ లోని సున్నిత ప్రాంతాల్లో పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన ఉన్నతాధికారులకు.. వీరు వాట్సాప్ వినియోగిస్తూ కనిపించారు. ఈ నేపథ్యంలో అనర్హత వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయోధ్య తీర్పు నేపథ్యంలో జబల్​పుర్​ వ్యాప్తంగా 2500మంది పోలీసులను మోహరించారు. 25 తాత్కాలిక అవుట్​పోస్ట్​లను, పలుచోట్ల పికెటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:పట్టాలపై పహారా కాస్తున్న ముంబయి 'యముడు'

Last Updated : Nov 10, 2019, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details