తెలంగాణ

telangana

ETV Bharat / bharat

21 మంది సింధియా వర్గం ఎమ్మెల్యేల రాజీనామా - madhya pradesh jyotiraditya scindia

మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యత్వానికి 21మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. కాంగ్రెస్ బహిష్కృత నేత జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన ఈ శాసనసభ్యులు గవర్నర్​ లాల్​జీ టాండన్​కు రాజీనామా లేఖలను పంపారు. బెంగళూరు రిసార్టులో ఉన్న ఈ నేతలు తమకు భద్రత కల్పించాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో రాజీనామాలు చేసినవారిలో ఉన్న ఆరుగురు మంత్రులను పదవుల నుంచి తొలగించాలని గవర్నర్​కు లేఖ రాశారు ముఖ్యమంత్రి కమల్​నాథ్.

19mlas resigned
19మంది సింధియా వర్గం ఎమ్మెల్యేల రాజీనామా

By

Published : Mar 10, 2020, 3:27 PM IST

Updated : Mar 10, 2020, 4:17 PM IST

మధ్యప్రదేశ్​ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బెంగళూరు రిసార్టులో ఉన్న 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహా మొత్తం 21 మంది తమ రాజీనామా లేఖలను గవర్నర్ లాల్​జీ టాండన్​​కు పంపించారు. జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా విషయం బయటికి వచ్చిన అనంతరం పదవులు వీడటంపై నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ్యత్వానికి రాజీనామాలు చేస్తూ ఈ-మెయిల్​ ద్వారా లేఖలను పంపారు.

రాజీనామాలు సమర్పించిన కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు తమకు రక్షణ కల్పిచాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఓ ముఖ్యమైన పనిపై స్వచ్ఛందంగా బెంగళూరుకు వచ్చామని.. తమ పని సాఫీగా సాగేలా రక్షణ కల్పించాలని కోరారు.

'ఆరుగురు మంత్రులను తొలగించండి'

శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆరుగురు మంత్రులను వెంటనే పదవుల నుంచి తొలగించాలని గవర్నర్​ను కోరారు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​ నాథ్​. ఎమ్మెల్యేలుగా రాజీనామాలు చేసిన ఇమారతి దేవి, తులసి సిలావత్, గోవింద్ సింగ్ రాజ్​పుత్, మహేంద్ర సింగ్ సిసోడియా, ప్రద్యుమ్న్ సింగ్ తోమర్, ప్రభురామ్ చౌదరీలను తొలగించాలని తన సిఫారసు లేఖలో పేర్కొన్నారు.

భాజపాలోకి కాంగ్రెస్​ ఎమ్మెల్యే..

మధ్యప్రదేశ్​ కాంగ్రెస్ సీనియర్​ ఎమ్మెల్యే బిసాహు లాల్​ సాహూ జీ భాజపాలో చేరినట్లు ప్రకటించారు. కమల్​నాథ్​ ప్రభుత్వంపై విసుగుచెందిన చాలా మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు త్వరలో రాజీనామాలు చేస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్​ నేత శివరాజ్​ సింగ్​ చౌహాన్​ సమక్షంలో భాజపాలోకి చేరారు.

ఇదీ చూడండి:సింధియా రాజీనామా వెనుక జరిగిన కథ ఇదే...

Last Updated : Mar 10, 2020, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details