17వ లోక్‌సభ స్పీకర్‌గా భాజపా ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతిపాదించగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, గడ్కరీ, అమిత్‌షాతో పాటు వివిధ పార్టీల ఎంపీలు సమర్థించారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ మూజువాణి ఓటు ద్వారా ఎన్నిక ప్రక్రియ చేపట్టగా.. సభ్యులు బిర్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓం బిర్లాను లోక్ సభ స్పీకర్‌గా ప్రతిపాదిస్తూ మొత్తం 13 తీర్మానాలు అందాయి.
స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్‌లు సభాస్థానం వరకూ తీసుకెళ్లారు. స్పీకర్ స్థానంలో బిర్లా ఆసీనులయ్యారు.